ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా తెలంగాణ వేడుకల్లో బోనాల జాతర

అమెరికా తెలంగాణ వేడుకల్లో బోనాల జాతర

హ్యూస్టన్‌లో జరుగుతున్న అమెరికా తెలంగాణ అసోసియేషన్‌ ద్వితీయ ప్రపంచ తెలంగాణ మహాసభల్లో  తెలంగాణ బోనాల జాతర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన మహిళా భక్తులు అమ్మవారికి బంగారు పాత్రలో తెలంగాణ బోనాన్ని సమర్పించారు. భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో భక్తులు అమెరికాలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. 

భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి అమెరికాలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణలతో పాటు ఆట అ్యధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ఆట కన్వీనర్‌ బంగారు రెడ్డి తదితరులు పాల్గొన్నారని కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :