ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఘనంగా ఆటా ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు ప్రారంభం

ఘనంగా ఆటా ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు ప్రారంభం

గత నెల రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూన్న అమెరికా తెలంగాణ సంస్థ నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి అనీ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు.... ఈ మహాసభల నిర్వహణ కార్యదర్శి బంగారు రెడ్డి, ఆటా  తెలంగాణ ఛైర్మన్ కరుణాకర్ మాధవరం మరియు సహాయ సమన్వయకర్త జగపతి వీరేటి సభలో ప్రసంగించారు.  

ప్రపంచ నలుమూలల నుండి పదునెనిమిది దేశాల నుండి 40 కి పైగా అనుబంధ సంస్థల ప్రతినిధులు, దేశ, రాష్ట్ర రాజకీయ ప్రతినిధులు, ఫ్రభుత్వ అధికారులు, వాణిజ్య వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, గాయకులూ, కళాకారులూ, మీడియా ప్రతినిధులు మరియు ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసిన అతిథులతో హౌస్టన్ మహానగర వీధులు కళ కళ లాడాయి.  ఈ రోజు అనగా శుక్రవారం సాయంత్రం దీపారాధన, గణపతి ప్రార్థన, తెలంగాణ పాటలు, కూచిపూడి, భరత నాట్యం లాంటి భారతీయ నృత్యాలతో ఆటా తెలంగాణ ప్రపంచ తెలంగాణ మహాసభల వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. సామాజిక పలకరింపులు అలాయి బలాయిలు జరిగాయి. తదుపరి కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించినా ప్రముఖులను అవార్డులతో సత్కరించారు. వారిలో మొదటగా శ్రీధర్ కాంచనచర్ల (కమ్యూనిటి సర్వీస్), Dr. పద్మజారెడ్డి (జీవిత సాఫల్యం), Dr. రత్నాకుమారి (జీవిత సాఫల్యం), రామ చంద్రా రెడ్డి (కమ్యూనిటి సర్వీస్), గజం అంజయ్య (చేనేత రంగం) ఉన్నారు.

భోజనాన్ని స్థానిక బిర్యాని పాట్ యాజమాన్యం చాలా చక్కని రుచికరంగా హైద్రాబాదీ, తెలంగాణ వంటకాలను అందించారు.

ఈ ప్రపంచ తెలంగాణ మహాసభలు మినీ తెలంగాణ ని తలపించాయి. ఇందులో దేశం నుండి తీసుకువచ్చిన ప్రత్యేక నిపుణలతో తయారు చేసిన చార్మినార్, దాని చుట్టూ వాణిజ్య అంగడ్లు, తిను బండారాలు ఉండేలా చాలా చక్కని ప్రణాళికతో ఈ మహాసభలు గొప్ప ఆకర్షణతో  వైవిధ్యభరితముగా రూపొందించారు. తెలంగాణ మరియు తెలుగు కళలను, సంప్రదాయాలను ఉట్టి పడేలా ఉండేందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తలకు, విచ్చేసిన అతిథులందరికి  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలను రాలేక పోయిన మరియు ప్రపంచములోని తెలుగు ప్రజలందరూ చూసేలా  ప్రత్యేక్ష ప్రసారాలను కల్పిస్తూన్న TV యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :