ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా తెలంగాణ మహాసభల షెడ్యూల్

అమెరికా తెలంగాణ మహాసభల షెడ్యూల్

హ్యూస్టన్‌లోని జార్జ్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే అమెరికా తెలంగాణ సంఘం ప్రపంచ మహాసభల కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

29వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10.30 వరకు రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5.30 నుంచి 11.30 వరకు యూత్‌ డిన్నర్‌, క్రూయిజ్‌ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు బాంక్వెట్‌ కార్యక్రమం ఉంటుంది. 6 నుంచి రాత్రి 11.30 వరకు వాణిజ్యవర్గాల స్టాల్స్‌ ప్రదర్శన జరుగుతుంది.

30వ తేదీ ఉదయం 7.30 నుంచి 10.30 వరకు రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. ఉదయం 8 నుంచి 11.30 వరకు వాణిజ్యవర్గాల స్టాల్స్‌ ప్రదర్శన, ఉదయం 8.30కు మహాసభల ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత వైద్యశిబిరం, 11.30 నుంచి సాయంత్రం 5 వరకు సిఎంఇ కార్యక్రమాలు జరుగుతాయి. 11.30 నుంచి 6 వరకు బిజినెస్‌, యూత్‌, మెట్రిమోనియల్‌, ఇమ్మిగ్రేషన్‌, అలూమ్ని, పొలిటికల్‌ సమావేశాలు ఆయా చోట్ల జరుగుతాయి. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 నుంచి 6 వరకు అవధాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5 నుంచి 11.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, రైతే రాజు, తెలంగాణ ధూమ్‌ధామ్‌, ఫ్యాషన్‌ షో, డ్యాన్స్‌ డ్రామా వంటివి జరుగుతాయి.

జూలై 1వ తేదీ ఉదయం 7.30 నుంచి 8.30 వరకు రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వాణిజ్యవర్గాల స్టాల్స్‌ ప్రదర్శన జరుగుతుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం?3 వరకు సిఎంఇ, ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం?12.30 వరకు సీతారామకళ్యాణం, 9నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉచిత వైద్యశిబిరం, బిజినెస్‌, సాహిత్య సమావేశాలు, మెట్రిమోనియల్‌, యూత్‌, ఇమ్మిగ్రేషన్‌, అలూమ్ని, పొలిటికల్‌, మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి.

ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు కల్చరల్‌ కార్యక్రమాలు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు పల్లెపాట, రాత్రి 8 నుంచి 11 వరకు గ్రాండ్‌ ఫైనల్‌ మ్యూజిక్‌ ఉంటుంది.

 

Tags :