ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పద్మజారెడ్డికి జీవిత సాఫల్యపురస్కారం

పద్మజారెడ్డికి జీవిత సాఫల్యపురస్కారం

అమెరికన్‌ తెలంగాణ అసోషియేషన్‌ (ఆటా) హూస్టన్‌ నగరంలో ఈ నెల 29, 30, జులై 1 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ప్రముఖ నృత్య గురువు పద్మజారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రణవ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్యూచిపూడి డ్యాన్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాభవాన్ని కాకతీయం నృత్య రూపకం ద్వారా ప్రాచుర్యం కల్పించినందుకు ఈ పురస్కారానికి తనను ఎంపిక చేశారని పద్మజారెడ్డి అన్నారు. హూస్టన్‌ నగరంలో తమ మూడు రోజుల పర్యటనలో నవదుర్గలు నత్య రూపకంతో పాటు.. కాకతీయం న త్యంలోని కొన్ని భాగాలను ప్రదర్శిస్తామన్నారు. భద్రాచలం అర్చకులు సీతారామకల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను శిష్య బందంలోని ఆరుగురితో  కలిసి సీతారామ కల్యాణానికి సంబంధించి అంశాలను నృత్యరూపంలో ప్రదర్శిస్తామని పద్మజారెడ్డి వివరించారు.

 

Tags :