ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ ముస్తాబు

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ ముస్తాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు విశాఖపట్నం ముస్తాబవుతోంది. 3, 4 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజీనీరింగ్‌ కళాశాల మైదానంలో జరగనున్న ఈ సదస్సుకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సదస్సుకు పేరు రిజిస్ట్రేషన్లు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు ఒక లింకు పంపుతున్నారు. ఆ లింకు క్లిక్‌ చేస్తే వివరాలు నమోదు చేసుకున్నాక ఒక క్యూఆర్‌ కోడ్‌ వెళుతుంది. ఒక పారిశ్రామికవేత్త పేరుతో ఒక్కటే కోడ్‌ ఉంటుంది. ఆ క్యూఆర్‌ కోడ్‌నే సెక్యూర్టీ చెకింగ్‌కు ఉపయోగించనున్నారు. పర్యవేక్షణ బాధ్యలు చూస్తే అధికారుల నుంచి మీడియా ప్రతినిధుల వరకు క్యూఆర్‌ కోడ్‌తోనే అనుమతి ఇవ్వనున్నారు. రవాణా, వసతి సౌకర్యాలకు రూ.5 కోట్లు ఖర్చు అవతుందని యంత్రాంగం అంచనా వేసింది. తొలి విడతగా ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేసింది. 352 వాహనాలను అధికారులు సమీకరిస్తున్నారు. ముఖేష్‌ అంబానీ, నవీన్‌ జిందాల్‌, మిత్తల్‌, అదానీ వంటి పారిశ్రామిక దిగ్గజాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ నుంచి 30 వరకు బెంజి, ఆడి కార్లను రప్పిస్తున్నారు. 

 

 

Tags :