ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆగ్రవర్ణాల పేదలను ఆదుకుంటాం : చంద్రబాబు

ఆగ్రవర్ణాల పేదలను ఆదుకుంటాం : చంద్రబాబు

ఆగ్రవర్ణాలలో ఉన్న పేదలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మంజునాథ కమిషన్‌ నివేదిక రాగానే అందరికి ఆమోదయోగ్యమైన  విధంగా కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. అగ్రవర్ణాల పేదలను ఆదుకునేందుకు రూ.750 కోట్లు కేటాయించామని అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం వివక్షకు, రాజకీయ అణచివేతకు గురికాకుండా చూసే బాధ్యత తనదని సృష్టం చేశారు. పేదల సంక్షేమం విషయంలో ఎవరు అవినీతికి పాల్పడినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ  రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేదలకు నిరంతరం అందేలా చూడటమే తమ పార్టీ లక్ష్యమని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని విధాల ఆదుకునే బాధ్యత తదన్నారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.


Click here for Event Gallery
                           Click here for Political Resolution 2017

 

Tags :