ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మెగా ఐటీసిటీగా విశాఖ, ఐటీ హబ్‌గా అమరావతి

మెగా ఐటీసిటీగా విశాఖ, ఐటీ హబ్‌గా అమరావతి

ప్రతిపాదించిన ఐటీ టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి

అమెరికా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఐటీ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి చంద్రబాబుకు ప్రజంటేషన్‌ ఇచ్చారు. విశాఖపట్టణంను మెగా ఐటీ సిటీగా, అమరావతిని మేజర్‌ ఐటీ హబ్‌గా మార్చాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఐటీ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయని చెప్పారు.

ఈ సమావేశానికి దాదాపు 80కిపైగా ఐటీ సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు.  ఐటీ ఆఫీసులకోసం అవసరమైన స్థలాన్ని సమకూర్చా లని, ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో ఐటీ కార్యాల యాలు నడుచుకునేలా చూడాలని కోరారు. దాదాపు 450 మంది ఎన్నారైలు తమ కార్యాలయా లను ఎపిలో నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. నవంబర్‌ 2017లో 100 ఎంఓయులను కుదుర్చు కోవడం జరుగుతుందని ప్రసాద్‌ గారపాటి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సంస్థలను నెలకొల్పడానికి 60 కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల 8 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా 20వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30 ఇంజనీరింగ్‌ కళాశాలల సంఖ్యను 300కు పెంచడంవల్ల ఎంతోమంది సాంకేతిక విద్యను అభ్యసించి నేడు ఇక్కడ ఉన్నత స్థితిలో కనిపిస్తున్నారని చెప్పారు. ఇది ఆనందకరమైన విషయమని చెప్పారు. వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.

 

Tags :