ఫ్రెషర్స్ కు విప్రో మరో షాక్?
ఐటీ కంపెనీల్లో ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్ ఇస్తోంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 15 నెలలకు పైగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు మరో పరీక్ష విధించనుంది. ఇలాంటి శిక్షణను ఇప్పటికే పూర్తి చేసినప్పటికీ, మరోసారి ప్రాజెక్ట్ రెడీనెస్ ప్రోగ్రామ్ (పీఆర్పీ) శిక్షణ అంటే ఈ సాకుతో కొంతమంది ఫ్రెషర్స్‌ను తొలగించేందుకేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వేతనాల్లో సగం కోత విధించిన తరువాత కూడా ఆన్‌బోర్డింగ్ కష్టాలకు తెరపడటం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రెషర్ల వేతనాలను రూ.6.5 నుంచి రూ.3.5 లక్షలకు తగ్గించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.






