వాట్సాప్ మరో కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్దమైంది. పొరపాటున ఏదైనా మెసేజ్ అవతలి వారికి పంపిస్తే దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం ఉంది. ఒకప్పుడైతే అదీ ఉండేది కాదు. తాజాగా మనం పంపించిన మెసేజ్‌లో ఏదైనా చిన్నపాటి తప్పు ఉంటే సరిచేసుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొస్తోంది. వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ కింద ఏదైనా సందేశాన్ని 15 నిమిషాల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి. అప్పుడు కాపీ అనే ఆప్షన్‌తో పాటు ఎడిట్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మార్పులు చేసుకోవచ్చు. 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లయినా ఎడిట్ చేసుకునే సదుపాయం ఉంది. ఒకసారి ఎడిట్ చేశాక ఎడిటెడ్ అనే సందేశం అవతలి వ్యక్తికి ఈ మెసేజ్ కింద కనిపిస్తుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ రానుంది.






