Vi యొక్క నూతన రూ. 368 మరియు రూ. 369 నెలవారీ రీఛార్జ్ తో Sun NXT & Sony LIV సబ్స్క్రిప్షన్ మరియు 2GB రోజువారీ డేటా పొందవచ్చు
• నెల మొత్తం మరింత రోజువారీ డేటా + వినోదాన్ని అందించే Vi యొక్క స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోండి
• తన కస్టమర్లకు ప్రాంతీయ కంటెంట్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేలా Sun NXT బండిల్ ప్లాన్లను అందిస్తున్న ఒకే ఒక్క telco
భారతదేశపు ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్, Vi, దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ వినియోగదారులకు విలువైన మరియు వినోదంతో నిండిన అనుభవాన్ని అందించడానికి రెండు ఎంటర్టైన్మెంట్ లోడెడ్ నెలవారీ రీఛార్జ్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు 1 నెల వాలిడిటీతో అపరిమిత కాల్లు, 100 SMS/రోజు, OTT ప్రయోజనం మరియు 2GB రోజువారీ డేటాను అందిస్తాయి.
Vi యొక్క రూ. 368 రీఛార్జ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు TV మరియు మొబైల్లో Sun NXTకి ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది, ఇది తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ మరియు బంగ్లా భాషల్లో ప్రాంతీయ సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలను చూడటానికి వీలు కల్పిస్తుంది. ఈ SunNXT సబ్స్క్రిప్షన్ రోజువారీ 2GB డేటా + అపరిమిత కాల్లు + రోజుకు 100 SMS కు అదనం. చెల్లుబాటు సమయం 30 రోజులు.
మరోవైపు, Vi యొక్క రూ. 369 రీఛార్జ్ తో రోజువారీ 2GB డేటా + అపరిమిత కాల్లు + రోజుకు 100 SMSలతో పాటు, మొబైల్ ద్వారా Sony LIV యొక్క భారీ-విలువైన కంటెంట్ మరియు లైవ్ స్పోర్టింగ్ యాక్షన్ యొక్క భారీ లైబ్రరీ ని ప్రీపెయిడ్ కస్టమర్లకు 30 రోజుల యాక్సెస్‌ను అందిస్తుంది.
నిజంగా అపరిమిత డేటా అనుభవాన్ని అందిస్తూ, Vi యొక్క కొత్త రూ. 368 మరియు రూ. 369 పోర్ట్‌ఫోలియోలో 200GB వరకు వీకెండ్ డేటా రోల్ఓవర్ మరియు రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అదనపు ఖర్చు లేకుండా రాత్రిపూట అపరిమిత డేటా వంటి ఇతర ప్రత్యేక ప్రయోజనాలు సైతం అందిస్తున్నాయి. ఈ రీఛార్జ్ ప్లాన్లు అదనంగా Vi MTV యాప్ యొక్క VIP సభ్యత్వాన్ని సైతం అందిస్తాయి.






