J.D. Vance : ముగిసిన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారత్ పర్యటన

అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్(J.D. Vance) చేపట్టిన భారత పర్యటన గురువారం ముగిసింది. ఆయన తన భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో కలిసి గురువారం ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ (Washington)కు తిరిగి వెళ్లారు. వాన్స్ కుటుంబం సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జైపుర్ చేరుకుంది. మంగళవారం ఆ విశిష్ట అతిథులు జైపుర్‌లోని అంబర్ కోట (Amber Fort)ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజ్ మహల్ (Taj Mahal) కూడా సందర్శించారు. వాన్స్ గత సోమవారం ఉదయం దేశ రాజధానిలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.