యాపిల్ గుడ్ న్యూస్.. భారత్ లో
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ గూడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు స్టోర్లును ప్రారంభించనుంది. ముంబయి, ఢిల్లీలో ఈ వారంలోనే రెండు స్టోర్లను యాపిల్ తెరవనుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్‌ను ముంబయిలో ప్రారంభించనుంది. ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ తెరవనుంది. ఈ కార్యక్రమానికి యాపిల్ సీఈవో టిమ్ కుక్ హాజరు కానున్నారు. భారత్‌లో స్టోర్లు తెవరడం, కొత్త పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టడం తమ కీలక మైలురాయి అని కంపెనీ పేర్కొంది. స్థానికతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన రెండు స్టోర్లూ భారత వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచుతాjని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగాల సృష్టికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. .






