దేశంలో అత్యంత ఖరీదైన ఫ్లాట్ … రూ.369 కోట్లు
దేశ వాణిజ్య రాజధాని అత్యంత ఖరీదైన నగరం. ముంబై నగరంలో తాజాగా మూడంతస్తుల ఫ్లాట్ అత్యధిక ధరకు అమ్ముడైంది. ఈ ట్రిప్లెక్స్ ఫ్లాట్ 369 కోట్లకు అమ్ముడైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్ వ్యవస్థాపకుడు జేపీ తపారియా, ఆయన కుటుంబ సభ్యులు దీన్ని కొనుగోలు చేశారు. దేశంలోనే ఇదే అత్యంత ఖరీదైన ఫ్లాట్ అని ముంబై రియల్ ఎస్టేట్ వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్స్ ప్రాంతంలో ఈ ఫ్లాట్ ఉంది. సముద్రపు దిక్కుగా ఉన్న ఈ ఇంటిని లోధా గ్రూప్‌కు చెందిన మార్కోటెక్ డెవలపర్స్ నుంచి ఆయన కొనుగోలు చేశారు. సూపర్ లగ్జరీ నివాస టవర్గా పేరుపడిన లోధా మలబార్ ప్యాలెసెస్‌లోని 26,27, 28 అంతస్తుల్లో ఈ ట్రిపెక్ల్స్ ఫ్లాట్ ఉంది. దీని వైశాల్యం 27.160 చదరపు అడుగులు, ఒక్కో చదరపు అడుగు ధర 1.36 లక్షలు. చదరపు అడుగుల ఆధారంగా దేశంలోనే ఇదే అత్యంత విలువైన ఫ్లాట్‌గా తెలిసింది. ఈ ఫ్లాట్ కొనుగోలు కోసం తపారియా కుటుంబం స్టాప్ డ్యూటీ కింద 19.07 కోట్లు చెల్లించింది.






