ఆర్ బీఐ కీలక నిర్ణయం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీరేట్ల పెంపు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని తెలిపారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈనిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు పేరొన్నారు. 2023-24లో ఇదే తొలి ద్రవ్యపరపతి విదాన సమీక్ష. ద్రవ్యోలబ్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్బీఐ గత ఏడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చింది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. 2023 ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైంది. అంతక్రితం నెల ఇది 6.52 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత పరిధి అయిన ఆరు శాతానికి పైనే స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఆర్బీఐకి ఇప్పటి వరకు అనివార్యమైంది.






