BCCI: బోర్డు అధ్యక్షుడు అతనే..? కీలక మార్పులు..!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న అంశం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. జట్టుతో పాటుగా బోర్డు అంశాల విషయంలో జాతీయ మీడియా వెల్లడిస్తున్న సంచలన విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా బోర్డులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ శుక్రవారం ఆ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం. దీనితో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు స్వీకరించారని జాతీయ మీడియా వెల్లడించింది.
తాజా జాతీయ క్రీడా పాలన బిల్లు 2025 ప్రకారం, జాతీయ రాష్ట్ర సమాఖ్యలకు వయోపరిమితిని 75 కి పెంచడంతో, బిన్నీ 70 ఏళ్లు నిండడంతో బోర్డు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. అయితే, దైనిక్ జాగరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం రోజర్ బిన్నీ ఆ పదవి నుంచి వైదొలిగారని తెలుస్తోంది. దీనితోనే ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ బాధ్యతలు చేపట్టారు. 2025 ఆసియా కప్ కు ముందు, భారత క్రికెట్ బోర్డు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికే టీం ఇండియా జెర్సీల విషయంలో వివాదం అయింది.
డ్రీం 11(Dream 11) తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే 2025 ఆసియా కప్ కు ముందు జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్‌ను వెతకాల్సి ఉంది. కొత్త బీసీసిఐ అధ్యక్షుడిగా అనీల్ కుంబ్లే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మాజీ కోచ్ ద్రావిడ్ పేరు కూడా వినపడుతోంది. జట్టులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో బోర్డు ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.