ముఖేష్ అంబానీ తన మిత్రుడికి ఊహించని గిఫ్ట్.. 1500 కోట్ల విలువైన
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తన స్నేహితుడికి అపురూప కానుక ఇచ్చారు. మిత్రుడికి కనీసం కలలో కూడా ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. తనతో చదువుకున్న వ్యక్తి, మొదటి నుంచి కంపెనీలో ఉద్యోగిగా ఉన్న మిత్రుడు, ముఖేష్ అంబానీకి కుడిభుజంగా పేరుపడిన మనోజ్ మోడీ అనే మిత్రుడికి ముంబైలో 1500 కోట్ల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు. 22 అంతస్థులు ఉన్న ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల వైశ్యాలంలో ఉంది. ఈ ఇళ్లు ముంబైలోని నేపి యన్ సీ రోడ్లో ఉంది. ఈ ఇళ్లు 1500 కోట్ల విలువ చేస్తుంది. ముఖేష్ అంబానీతో కలిసి ముంబై యూనివర్సిటీలో మనోజ్ మోడీ ఇంజినీరింగ్‌లో కెమికల్ టెక్నాలజీ చదివారు. 1980లో ఆయన రిలయన్స్‌లో చేరారు. ఆయన ముఖేష్ అంబానీతో పాటు, ఆయన పిల్లలు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీలతో కూడా పని చేస్తున్నారు. ముఖేష్ అంబానీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మనోజ్ మోడీనే అనే పేరుంది. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలో డైరెక్టర్‌గా ఉన్నారు.






