J.D. Vance: అంబర్ కోటను సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) కుటుంబంతో సహా భారత్‌కు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాన్స్ దంపతులు తమ కుమారులు ఇవాన్, వివేక్, కుమార్తె మీరాబెల్‌లతో జయపుర లోని అంబర్ కోట (Amber Fort) ను సందర్శించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma) , డిప్యూటీ సీఎం దియాకుమార్ (Diya Kumar) వారికి స్వాగతం పలికారు. చంద, పుష్ప అనే ఏనుగులతో వారికి ప్రత్యేక ఆహ్వానాన్ని ఏర్పాటు చేశారు. కోటలో ప్రదర్శించిన పలు రాజస్థానీ (Rajasthani) సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలను వీక్షిస్తూ వాన్స్ కుటుంబం కోటను సందర్శించారు.