J.D. Vance: భారత్‌కు ఎఫ్-35లు అందిస్తాం: జేడీ వాన్స్

అమెరికా మరోసారి భారత్ (India)కు ఎఫ్-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేసింది. భారత్‌కు ఎఫ్-35లు అందించడానికి సిద్దంగా ఉన్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) తెలిపారు. దేశ గగనతలాన్ని సంరక్షించడంలో ఈ ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి మునుపెన్నడూ లేనంత సామర్థ్యాలను అందిస్తాయని చెప్పారు. అమెరికా (America) నుంచి మరింతగా రక్షణ సామగ్రిని కొనుగోలు చేయడం భారత్‌కు ప్రయోజనకరమని అన్నారు. అమెరికాతో రక్షణ సహకారాన్ని కొనసాగించడం ద్వారా భారత్ మరింత ప్రయోజనం పొందాలని వాన్స్ ఆకాంక్షించారు. ఇటీవల ప్రధాని మోదీ (Prime Minister Modi) అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్‌ను భారత్‌కు అందిస్తామని ట్రంప్(Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఎఫ్-35 విమానాల కొనుగోలుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని వైమానికి దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్యానించారు.