ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. రూ.64 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. ఈ మేరకు 5,11, 862 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 5,11,862 షేర్ల విలువ దాదాపు రూ.64 కోట్లు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ 2015 స్టాక్ ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్ కింద 1,04,335 ఈక్విటీ షేర్లు, ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ 2019 కింద 4,07,527 ఈక్విటీ షేర్లను కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కేటాయింపు తర్వాత కంపెనీ విస్తరించిన షేర్ క్యాపిటల్ రూ.2,074,9 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎక్స్పాండెడ్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రాం 2019 కింద పొందిన షేర్లకు సంబంధించి ఎలాంటి లాక్`ఇన్ పీరియడ్ ఉండదు.






