Rajnath Singh: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ (Pakistan)ను ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని భారత్ విడిచి పెట్టడం లేదు. ఇప్పుడు వినోద రంగం వియంలోనూ భారత్ చర్యలకు ఉపక్రమించింది. వినోదం విషయంలో ఓటీటీ (OTT )లు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. భాషా సరిహద్దులను సైతం చెరిపేశాయి. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాక్ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫాంలకు సూచనలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, ఓటీటీ వేదికలు, మీడియో స్ట్రీమింగ్ (Media streaming) ప్లాట్‌ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్థాన్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్‌స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇదులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీ వేదికలు పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది.