18న యాపిల్ తొలిస్టోర్ ప్రారంభం
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ యాపిల్ మన దేశంలో మొదటి అధికారిక స్టోర్‌ను ప్రారంభించనుంది. ముంబైలోని ముఖేష్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంపెక్ల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను ఈ నెల 18న ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్‌ను యాపిల్ బీకేసీగా వ్యవహరిస్తున్నారు. యాపిల్ కంపెనీ తన రెండో అధికారిక స్టోర్‌ను న్యూ ఢిల్లీలో ఈ నెల 20న ప్రారంభించనుంది. ఈ స్టోర్‌ను యాపిల్ సాకేత్‌గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ స్టోర్‌పై యాపిల్ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. 20నే స్టోర్ ప్రారంభిస్తున్న యాపిల్ చేసిన ప్రకటన యూజర్లకు సర్ప్రైజ్గా ఉంది. యాపిల్ సాకేత్ స్టోర్‌పై లోగోను ఢిల్లీ మహానగర చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా రూపొందించడం విశేషం. యాపిల్ మొదటిసారిగా భారత్‌లో అధికారిక స్టోర్లను ఏర్పాటు చేస్తున్నందుకు కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఇండియాకు రానున్నట్లు తెలిసింది. ఆయన ఈ స్టోర్లను ప్రారంభిస్తారని భావిస్తున్నార. ఆయన పర్యటన వివరాలను యాపిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అవుతారని చెబుతున్నారు.






