త్వరలో భారత్ కు యాపిల్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ త్వరలో భారతదేశంలో మొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ని ప్రారంభించబోతోంది. దేశంలో ఐఫోన్ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్ తన రిటైల్ స్టోరీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ముంబయి లో మొదటి స్టోర్‌ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే ఎప్పటిలోగా అది వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని మాత్రం వెల్లడిరచలేదు. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఉండనుంది. దీన్ని యాపిల్ బీకేసీగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.






