భారత్ లో యాపిల్ తొలి స్టోర్ ప్రారంభం
ముంబయిలో దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్ ప్రారంభమైంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (జీకేసీ) లో ఏర్పాటు చేసిన స్టోర్ ఓపెనింగ్ కు యాపిల్ సీఈవో టిమ్ కుక్ హాజరయ్యారు. యాపిల్ స్టోర్ల ప్రారంభం కోసం ఆయన ఇండియాకు వచ్చారు. దాంతో ఆయన్ని సినీ సెలబ్రిటీలు వరుసగా కలుసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, ఒకప్పటి మీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్ తదితర సెలబ్రిటీలు కుక్ ను కలిశారు. దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్ ముంబైలో ప్రారంభమైంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ( జీకేసీ)లో ఏర్పాటు చేసిన స్టోర్ ఓపెనింగ్‌కు యాపిల్ సీఈవో టిమ్ కుక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను 20న ఢల్లీిలో ఓపెన్ చేయనున్నారు. ఇండియాలోకి యాపిల్ ఎంటరై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.






