అమెరికా కారణంగానే… ఓపెన్ స్కైకు దూరం!

ఓపెన్ స్కై ఒప్పందం నుంచి రష్యా వైదొలగుతున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బిల్లుపై కూడా ఆయన సంతకం చేశారు. అమెరికా కారణంగానే తాము బయటికి వచ్చినట్టు రష్యా చెప్పుకొచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇద్దరూ ఓపెన్ స్కై ఒప్పందానికి విముఖత వ్యక్తం చేశారు. ప్రచ్చన్న యుద్ధ కాలంలో అణ్వాయుధాల మోహరింపులు, అనుమానాస్పద కార్యకలాపాలు సాగించకుండా విమానాల్లో నిఘా పెట్టడానికి చేసుకున్న ఒప్పందమే ఓపెన్ స్కై అగ్రిమెంట్ 2002లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.