India: భారత్ పై పాకిస్తాన్ ఆర్మీ ఏడుపులు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తో భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. పలు ప్రాంతాల్లో భారత్ దాడులకు దిగింది. ఇదే సమయంలో బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడు, ఏ వైపు నుంచి దాడి చేస్తుందో అర్ధం కాక పాకిస్తాన్ తలమునకలు అవుతోంది. తమకు బలూచిస్తాన్‌లో వేడి పెరుగుతున్న కొద్దీ, భారత్ పై తమ అక్కసు వెళ్లగక్కుతుంది పాకిస్తాన్.
పాకిస్తాన్ సైనిక-ఇంటెలిజెన్స్ సంస్థకు చెందిన “డెత్ స్క్వాడ్” లోని ముగ్గురు సభ్యులను అంతం చేసింది చంపడానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA). ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్ పై విమర్శలు చేసారు. పాకిస్తాన్‌పై తన ప్రాక్సీ యుద్ధాన్ని భారత్ తీవ్రతరం చేస్తోందని ఆరోపించారు. బలూచిస్తాన్‌లో భారత దళాలపై జరిగిన దాడులకు భారత నిఘా సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(Raw) సంస్థనే కారణమని మునీర్ ఆరోపించారు. మే నెలలో జరిగిన చిన్న యుద్ధంలో ఓడిపోయిన భారత్, ఓర్వలేక ప్రాక్సీ యుద్ధం చేస్తుందని ఆయన విమర్శలు చేసారు. పాకిస్తాన్ అంతర్గత కలహాలకు భారత్ ను నిందించడం ఆ దేశ ఆర్మీకి కొత్త కాదు.
గతంలో ఎన్నో సార్లు ఈ వ్యూహాన్ని అమలు చేసింది. గత కొన్ని నెలలుగా బలూచిస్తాన్‌లో తిరుగుబాటు ఊపందుకుంది. పాకిస్తాన్ దళాలపై దాడులు పెరిగాయి. దీనితో ఆ బాధను భారత్ పై వెళ్ళగక్కింది అక్కడి ఆర్మీ. బలూచిస్తాన్‌లో జరిగిన ఒక సైనిక వర్క్‌షాప్‌లో జనరల్ మునీర్ మాట్లాడుతూ, భారత్ పై విమర్శలు చేసారు. భారత్.. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని, ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసారు. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇటీవల తమ ప్రాంతానికి వచ్చే పాక్ సైనిక వాహనాలను ధ్వంశం చేసింది.