అంతరిక్షంలోకి అమెజాన్ వ్యవస్థాపకుడు!

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణానికి సిద్దం అయ్యాడు. జులైలో అంతరిక్షంలోకి వెళ్తున్న వ్యోమ నౌకలో తన సోదరుడితో కలిసి ప్రయాణం చేస్తున్నట్టు వెల్లడించారు. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ చేపట్టే అంతరిక్ష సందర్శనలో భాగంగా జులై 20న ప్రయాణం ఉంటుంది. సాదారణ పౌరుల అంతరిక్ష యాత్రలో భాగంగా సందర్శకులను తీసుకెళ్తున్న తొలి వ్యోమ నౌక ఇదే కావడం గమనార్హం.ఆరుగురు వ్యక్తులు వెళ్తున్నారు. 10 నిమిషాలుకొనసాగుతుంది.
అంతరిక్షానికి, భూ వాతావరణానికి మధ్య కర్మన్ లైన్‍గా పిలువబడే ప్రాంతలో నాలుగు నిమిషాలు వీరు ఉంటారు. ఆ తరువాత భూమికి చేరుకుంటారు. జెఫ్ మాట్లాడుతూ అంతరిక్షానికి వెళ్లాలనేది తన చిన్ననాటి కోరిక అని జులై 20న సోదరుడు మార్క్తో వెళ్తునందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇది ఎంతో సహాసోపేతమైన యాత్ర అని, తనకు ఉన్న కలలో ఇది అతిపెద్దది అని, తన సోదరుడు మార్క్ బెజోస్‍తో వెళ్లడం ఎప్పటికీ మరిచిపోలేనిది అని వివరించారు. భూమి నుంచి 100 కిలోమీటర్ల కంటే ఎత్తులో వీరు వెళ్లారు.