Asim Munir: ఆర్మీచీఫ్ మునీర్ స్వార్థం పాకిస్తాన్ ను ముంచేసిందా…?

పహల్గాం ఉగ్రదాడికి మూలకారణమైన పాక్ ఆర్మీచీఫ్ మునీర్ (Asim Munir).. కేవలం తన స్వార్థం కోసం సొంత దేశాన్ని పణంగా పెట్టారా..? తన పదవి కాపాడుకునేందుకు, సైన్యంపై పట్టును నిలుపుకునేందుకు… దేశాన్ని యుద్ధంలోకి నెట్టారా..? యుద్ధంలో పాక్ గెలవదని తెలిసి , ఈ దుస్సాహసానికి మునీర్ ఎందుకు ఒడిగట్టారు..? ఇప్పుడు పాకిస్తాన్ .. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కనుంది..? ఇప్పుడిదే అంశంపై అంతర్జాతీయంగా పెద్ద చర్చే జరుగుతోంది.
గతంలో ఐఎస్ఐ ఛీఫ్ గా పనిచేసినపుడే పూల్వామా ఎటాక్ కు ప్లాన్ చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నాడు మునీర్. తాజాగా పహల్గాం ఘటనలో 26 మందిని చంపడంలో సూత్రదారి మునీర్. ఏప్రిల్ 16న కాశ్మీర్ పై అతడు చేసిన వ్యాఖ్యలు పహల్గాం దాడి వెనక అతడి పాత్రను స్పష్టం చేస్తున్నాయి. పాక్ సైన్యం మొత్తం ప్రస్తుతం మున్నీర్ చేతుల్లోనే ఉంది. 2018లో ఐఎస్ఐ ఛీఫ్ గా ఇమ్రాన్ ఖాన్ ఆసిఫ్ మునీర్ ను నియమించారు. అయితే ఇమ్రాన్ భార్య అవినీతిని మునీర్ బయటపెట్టి కలకలం రేపాడు. దీంతో పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత సంకీర్ణ సర్కార్ ఏర్పడ్డాక సైన్యాధ్యక్ష భాద్యతలను తీసుకుని ఇమ్రాన్ ను జైలుకు పంపి పగతీర్చుకున్నాడు మునీర్. మొదట కాస్త వెనకడుగు వేసినట్లు కనిపించినా తర్వాత సైన్యంపై పట్టుబిగించాడు. తన మనుషులను కీలక స్థానాల్లో నియమించాడు.
నెమ్మది నెమ్మదిగా రాజకీయ వ్యవస్థపై పట్టుబిగించాడు మునీర్. ఇప్పుడు పాకిస్తాన్ (Pakistan) లో అతడు చెప్పిందే ఫైనల్. భరించలేమని తెలిసినా యుద్ధ భూమిలో పాక్ యుద్ధానికి సై అనడానికి కారణం ఆర్మీ ఛీఫే. ఉగ్రదాడికి దిగితే భారత్ ఎదురుదాడికి దిగుతుందని పాక్ కు తెలుసు. దాన్ని తాము భరించలేమని కూడా వారికి తెలుసు. అయినా పాక్ యుద్ధానికి వెల్లడానికి కారణం ఆసిఫ్ మునీర్. అతన్ని ఆపే ధైర్యం పాక్ అధ్యక్షుడికి లేదు. ప్రధానికి లేదు, రక్షణ మంత్రికి లేదు. జనరల్ జియాఉల్ హక్ తర్వాత ఇస్లామిక్ నేషనలిజం నినాదం ఎత్తుకున్న వ్యక్తి మున్నీర్. అతను చదువుకున్నదే మదర్సాలో. అందుకే భారత్ పై అంత వ్యతిరేకత.
ఇటీవలి కాలంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చెలరేగిపోతోంది. అడుగడుగునా దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి సవాల్ విసురుతోంది. అయితే ఎప్పుడైతే జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్… ఆర్మీ అధికారులను చంపేయడంతో.. బీఎల్ఏ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి అర్థమైంది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ సైన్యంలో ఓ వర్గం మునీర్ కు వ్యతిరేకంగా మారింది. దీనికి తోడు తెహ్రీక్ ఏ తాలిబన్ సైతం .. పాక్ పై దాడులు చేస్తోంది. సైనికులను చంపేస్తోంది. ఈపరిణామాలతో మునీర్ సారథ్యంపై సైన్యంలోనే అనుమాానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన పట్టు నిలుపుకోవడానికి… గతంలో మాజీ ఆర్మీ అధ్యక్షులు చేసినట్లుగానే.. భారత్ పై దాడి శరణ్యమని మునీర్ తలిచినట్లు అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే పహల్గాం ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈదాడితో పాకిస్తాన్ అంతా ఓవైపు.. భారత్ మరోవైపుగా మారుతుందని మునీర్ కు తెలుసు. దీంతో ఇప్పుడు సైన్యంపై పట్టు నిలుపుకునేందుకు..భారత్ తో పరోక్ష ఘర్షణలకు తెరతీశాడు మునీర్. ఇప్పుడు అదే పాక్ మెడకు చుట్టుకుంటోంది.
ఓటమి తప్పదని తెలిసినా భారత్ తో కయ్యానికి కాలుదువ్వడానికి మునీర్ మాస్టర్ ప్లాన్ ఉందని కొందరు పాక్ నేతల అనుమానం. ఓటమి తర్వాత అందుకు బాధ్యులుగా పాక్ రాజకీయ వ్యవస్థను చూపించి తాను తిరుగుబాటు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆర్టిక్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో ప్రశాంత పరిస్తితులు నెలకొనడం మునీర్ కు ఇష్టం లేదు. అదే జరిగితే తన లక్ష్యం నెరవేరదు. అందుకే కాశ్మీర్ లో మళ్ళీ అలజడి రేపాడు. మునీర్ పదవీకాలం మరో రెండేళ్లు ఉంది. ఈలోపు అతడి నుంచి మరిన్ని కుట్రలు చూడాల్సి ఉంటుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది.