India-Pakistan: ఆపరేషన్ పీఓకే ఎందుకవసరం..? భారత్ కు కలగనున్న వ్యూహాత్మక ప్రయోజనాలివేనా..?

భారత్-పాక్ సరిహద్దు ఘర్షణలు పెరిగినప్పుడల్లా.. అందరి ఫోకస్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా అజాద్ కాశ్మీర్ వైపు మళ్లుతుంది. పీఓకే (POK)ను స్వాధీనం చేసుకోవాలంటూ భారత్ లో నినాదాలు వినిపిస్తాయి. అయితే ఇది యుద్ధానికి దారితీస్తుందన్న భయాలున్నాయి. అయినా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఎందుకు స్వాధీనం చేసుకోవాలి.. ఇది భారత్ కు ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలు అందిస్తుంది..?
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం చేసుకున్నా.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్డా దీటుగా బదులివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పీవోకేను (POK) తిరిగి సొంతం చేసుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ కూడా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు అమెరికా సాయం కోరుతోంది. అయితే పీవోకేను సొంతం చేసుకోవం వల్ల భారత్‌కు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
పీవోకే వల్ల కలిగే ప్రయోజనాలివే..
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను (Pakistan Occupied Kashmir) భారత్ సొంతం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంతం భారత్‌లో (India) అంతర్భాగమైనా.. విభజన తర్వాత జరిగిన అనేక పరిణామాల కారణంగా విడిపోయింది. తర్వాత పాకిస్తాన్ (Pakistan) ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద స్థావరంగా మార్చింది. ఇక్కడ టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్‌లోకి పంపించి విధ్వంసానికి పాల్పడుతోంది.
రష్యా నుంచి నేరుగా రావొచ్చు..
పీవోకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతం భారతదేశానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా ఇక్కడి నుంచి ఆసియా, ఆఫ్ఘనిస్తాన్‌లకు (Asia, Afghanistan) చేరుకోవాలంటే.. పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే పీవోకే మనదే అయితే నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే రష్యా (Russia) నుంచి భారత్ ఆయిల్‌ను సముద్ర మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ పీవోకేను స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యా నుంచి నేరుగా పైప్‌లైన్ ఏర్పాటు చేసి ఆయిల్‌ను దిగుమతి చేసుకునే వీలుంటుంది.
చైనాకు చెక్ పెట్టొచ్చు ..
మరోవైపు పీవోకే చాలా దేశాలతో సరిహద్దులు కలిగి ఉండడంతో చైనా తన వాణిజ్యపరమైన అంశాలకు పీవోకేను వేదికగా చేసుకుంటూ వస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ , కజకిస్తాన్, ఉజ్జికిస్తాన్ (Afghanistan, Kazakhstan, Uzbekistan) తదితర దేశాలతో పీవోకే సరిహద్దు కలిగి ఉండడంతో చైనాకు (China) వీలుగా మారింది. ఈ పీవోకేను స్వాధీనం చేసుకోవడం వల్ల చైనాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సహజ వనరులు ఉన్నాయి.
ప్రధానంగా పీవోకే ప్రాంతంలో అణుశక్తిని ఉత్పత్తి చేసేందుకు అవరసమైన యురేనియం కూడా ఇక్కడ లభిస్తుంది అలాగే నీలం, జీలం నదుల సాయంతో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. ఇక్కడి వనరులను ఉపయోగించి, జమ్మూ కశ్మీర్‌ను సస్యశ్యామలం చేసేందుకు అవకాశం ఉంటుంది. పనిలో పనిగా ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకూ వీలుంటుంది. పీవోకేను స్వాధీనం చేసుకోవడం వల్ల భారత్ ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే కాకుండా ఇలా అనేక ప్రయోజనాలు ఉంటాయి.