తానా తెలుగు తేజం భాషా పటిమ పోటీలు

ప్రవాస భారతీయ బాలలకు తెలుగు భాష పట్ల ఆసక్తిని కలిగించాలి. వారు తెలుగును చదవటం, రాయటం ఒక ఆటలాగ తేలికగా నేర్చుకోవాలి. అందుకే ఈ తెలుగు తేజం భాషా పటిమ పోటీలు.
నియమ నిబంధనలు:
* 1.కిశోర విభాగం : 5 – 10 ఏళ్లు వయసు. 2. కౌమార విభాగం: 11 – 14 ఏళ్లు వయసు. 3. కౌశల విభాగం : 15 – 18 ఏళ్లు వయసు. ఇలా మూడు వయో వర్గాల వారికి, వారి అవగాహన, గ్రహణ శక్తిని బట్టి పోటీలు జరుగుతాయి.
* తమ భాషా పరిజ్ఞానాన్ని బట్టి ఎవరైనా తమ వయసు కంటే పై విభాగం పోటీలలో పాల్గొన వచ్చు. కింది విభాగం పోటీలలో పాల్గొనడానికి అనర్హులు.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – తెలుగు రాష్ట్రాలలో నివసిస్తున్న పిల్లలు మాత్రం ఈ పోటీలలో పాల్గొన రాదు. ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, తెలుగు భాషపై మక్కువ గల ఎవరైనా పోటీలలో పాల్గొనవచ్చు.
* ప్రవేశ రుసుము చెల్లించటానికి చివరి తేదీ ఏప్రిల్ 25. ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకున్న వారే పోటీకి అర్హులు.
* జూన్ 4,5 తేదీలలో పోటీల నిర్వహణ.
https://forms.gle/u1gqzHFhTT3a6yYg9