బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చిన అమెరికా
సంచలనాలకు కేరాఫ్ అయిన పొట్టి క్రికెట్లో పసికూన అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. తొలి టీ20 సిరీస్ గెలుపొందింది. అలాగని ఏదో అనామక జట్టుపై గెలిచిందనుకుంటే పొరపడ్డట్టే. అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్లలో ఒకటైన బంగ్లాదేశ్ పై సిరీస్ విజయంతో పొట్టి ప్రపంచక కప్ ముందు కొండంత ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకుంది. సొంతగడ్డపై జరుగుతున్న మూడూ టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అమెరికా అద్బుత విజయంతో ఆశ్చర్యపరిచింది. ఆ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ హౌస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌ను మరోసారి చిత్తుగా ఓడిరచి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.
మే 23న హౌస్టన్‌లో జరిగిన రెండో టీ20 లో మొదట ఆడిన అమెరికా 6 వికెట్ల నష్టానికి 144 రన్స్ కొట్టింది. వికెట్ కీపర్, కెప్టెన్ మొనాక్ పటేల్( 42), అరొస్ జోన్స్( 35) మెరుపులతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం స్వల్ఫ చేధనలో అలీ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. సారభ్ నేత్రావల్కర్, షాడ్లేలు, రెండేసి వికెట్లతో విజృంభించగా బంగ్లాదేశ్ 138కే ఆలౌట్ అయింది. దాంతో మరో మ్యాచ్ ఉండగానే అమెరికా జట్టు పొట్టి సిరీస్ సొంతం చేసుకుంది.







