US: అమెరికా లో 133 మంది స్టూడెంట్స్ కి ఊరట! లా సూట్ లతో తిరిగి వచ్చిన జీవితం.!!
రెండు రోజుల క్రితం వచ్చిన కోర్ట్ ఆర్డర్ ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) దాదాపు 133 విద్యార్థులకు 31 మార్చి 2025 తేదీ న ఇచ్చిన SEVIS (Students & Exchange Visitor Information System) ఆర్డర్ ని ఉపసంహరించుకొని తాత్కాలిక నిలిపివేత ఆర్డర్ ఇచ్చింది. ఈ విద్యార్థులకి SEVIS విషయం పై పని చేస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలకు ఆ ప్రాకారం ఆదేశాలు ఇచ్చింది. ఈ 133 మంది విద్యార్థులలో చాల మంది ఇండియన్స్, ముఖ్యం గా తెలుగు వారు వున్నా విషయం అందరికి తెలిసిందే!! ఇప్పుడు వచ్చిన కోర్ట్ ఆర్డర్, దానిపై వచ్చిన DHS స్పందన వలన ఆ విద్యార్థులు అందరూ తమ చదువు కొనసాగించ వచ్చు అలాగే, తాము OPT (Optional Practical Training) మీద చేస్తున్న ఉద్యోగం కూడా కొనసాగించవచ్చు అని తెలిసింది.
ఈ విధంగా ఒక కోర్ట్ ఆర్డర్ వలన అనేక మంది విద్యార్థులు, లాయర్లు కూడా తమ వాదన మరింత బలంగా వివరించి కోర్ట్ నుంచి తమకు వచ్చిన SEVIS ఆర్డర్ ని నిలిపివేయ వచ్చని భావిస్తున్నారు.








