TPAS: టిఫాస్ ఉగాది వేడుకలు ఏప్రిల్ 12న
తెలుగుకళాసమితి (TPAS) ఉగాది వేడుకలు ఏప్రిల్ 12వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రిడ్జ్వాటర్ టెంపుల్ ఆడిటోరియం (Bridgewater Temple Auditorium) లో జరిగే ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. గాయనిమణులు సమీర తమ్మ, ధుృతికామరసు, అద్వైత్ బొందుగుల, లలిత రాణి, మాళవిక ఆనంద్ తోకల, గాయని శ్రీష్టి చిల్లా, గాయకుడు తరంగ్తోపాటు ఎం4ఎం మూవీ హీరోయిన్ జో శర్మ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు అందరూ రావాలని టిఫాస్ బోర్డ్ ట్రస్లీలు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కోరుతున్నారు.







