సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏకపాత్రాభినయం పోటీలకు టీజీఏబీ ఆహ్వానం

బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం (టీజీఏబీ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మసాచుసెట్స్‌లోని మార్ల్‌బరోలో చార్లెస్ వైట్‌కోంబ్ స్కూల్ వేదికగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టీజీఏబీ) ప్రకటించింది. జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ వేడుకలు మొదలవుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏకపాత్రాభినయం పోటీలు కూడా నిర్వహించనున్నారు. ఉత్సాహం ఉన్న పిల్లలు ఈ పోటీల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. పౌరాణిక, చారిత్రక, సామాజిక, కల్పిత పాత్రలను పిల్లలు తమ ప్రతిభతో అందరికీ పరిచయం చేయొచ్చని తెలిపారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులకు 1-3 నిమిషాలపాటు తమ పాత్రను ప్రదర్శించే అవకాశం ఉంటుంది.