BEA 2025: జాతీయ తెలుగు సంఘాల మద్దతుతో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025
త్వరలో న్యూజెర్సిలో జరగనున్న తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుకలకోసం ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ గురించి ఆయన మాటల్లో…అమెరికాలో పెరిగిన తెలుగు ఎంట్రప్రెన్యూర్ ల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వారికి ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో 2023లో తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను కాలిఫోర్నియా-శాన్ హోసెలో మొదటిసారిగా విజయవంతంగా నిర్వహించింది. అలాగే 2024 లో డల్లాస్ లో కూడా మరింత విజయవంతంగా నిర్వహించింది. టీవీ 9 ఎక్సెక్లూసివ్ మీడియా పార్టనర్ గా ఉండటం వలన ఈ ఈవెంట్ ని ప్రపంచానికి చూపించాం. ఈ వేడుకలకు ఎంట్రీ, రెఫరల్ చేసేందుకు ఉన్న నియమాలు ఏమిటంటే తెలుగువారు అయి ఉండాలి, కొంతకాలంగా బిజినెస్ చేస్తూ కంపెనీ కార్యకలాపాలు అమెరికాలో జరుపుతూ ఉండాలి అన్న రెండు నిబంధనలకు అనుగుణంగా తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ ని నామినేషన్ వేయాలని కోరుతున్నాము. తెలిసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు గూడా అర్హత ఉన్న కంపెనీల నామినేషన్ పంపవచ్చు. లేదా మా దృష్టికి కూడా తీసుకురావచ్చు. పేరు ప్రతిష్టలు ఉన్న విద్యావంతులు, బిజినెస్ లీడర్స్ తో కూడిన అడ్వయిజరీ ప్యానెల్ సలహాలు కూడా తీసుకొంటాము.
ఈ కేటగిరీలకు సంబంధించి నామినేషన్ వేయవచ్చు…
1. IT Technology 2. IT Staffing 3. IT Start Ups 4. Banking/Insurance/ Tax 5. Manufacturing/ Pharma 6. Hotels /Restaurants 7. Healthcare /Hospitals 8. Real Estate /Construction / Land Development 9. Cinema/Entertainment 10. Others/ Community
మేము చేసే ఈ కార్యక్రమం అమెరికా అంతటికి సంబంధించినది కనుక తానా, ఆటా, నాట్స్, టిటిఎ, జిటిఎ, మాట, టిడిఎఫ్ వంటి జాతీయ తెలుగు సంఘాల మద్దతు కోరాం. కమ్యూనిటీ పార్టనర్స్ గా మా అవార్డ్స్ ప్రక్రియ గురించి వారి వారి సభ్యులకు తెలిసేలా టిటిబిఇఓ ఫ్లయర్స్, ఈమెయిల్స్ అందరికి చేరాలని మా ఉదేశ్యం. ప్రతి తెలుగు సంఘంతో 22 ఏళ్లుగా కలిసి పని చేస్తున్న తెలుగు టైమ్స్ కి ఆ సంఘాలు కూడా ఈ మంచి పనికి మద్దతు ఇస్తున్నాయి. (సంఘాల మధ్య ఉన్న పోటీలు, విభేదాలకు అతీతంగా తెలుగు టైమ్స్ పని చేస్తున్న సంగతి అందరికీ తెలుసు కదా)
ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. పబ్లిక్ ఈవెంట్ కాదు. ఈ ఈవెంట్ కి కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. 5గురు కెమెరా టీమ్ మొత్తం ఈవెంట్ ని షూట్ చేసి, అప్పటికప్పుడు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ, హైదరాబాద్ లోని టీవీ 9 ఆఫీస్ కి ట్రాన్స్ మిట్ చేస్తే, వారు కొన్ని హైలైట్స్ అప్పటికప్పుడు ప్రసారం చేసి, మరునాడు ఆదివారం 25 మే నాడు వేడుకల మొత్తాన్ని 3 గంటలపాటు ప్రసారం చేస్తారు. ఇందులో గవర్నమెంట్ ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, బిజినెస్ లీడర్స్, అవార్డ్ గ్రహీతల మెసేజ్ లు ఉంటాయి.
ఒక్క సారి ఇంతకు ముందు జరిగిన అవార్డ్స్ వేడుకలు, ఎన్నికయిన అవార్డు విన్నర్ లు గమనిస్తే ఈ వేడుక ఏ విధంగా జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం వేరు వేరు సిటీలలో చేయడం లో మా ఉద్దేశ్యం ప్రతి చోట మా వేడుక అందరికి తెలియాలి అన్నదే. అందరూ ఈ వేడుక కోసం ఎదురు చూడాలి. తీసుకునే అవార్డుకి సొసైటీలో కమ్యూనిటీలో ఒక గుర్తింపు రావాలి అన్నదే మా లక్ష్యం.
ఇంకెందుకు ఆలస్యం ! ఇప్పుడే మీ నామినేషన్ ని పంపండి.!!
లేదా ఈ కార్యక్రమానికి మీ మద్దతు ఇవ్వండి. కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నట్లు చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు.








