ఏప్రిల్ 22,23,24 తేదీలలో… ఘనంగా “తానా కవితాలహరి”

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని “కవితాలహరి” పేరుతో ప్రతిష్టాత్మకంగా ఆంతర్జాతీయ కవిసమ్మేళనం” నిర్వహిస్తుంది.
ఏప్రిల్ 22,23,24 వ తేదీల్లో జూమ్ సమావేశం లో జరగబోయే కార్యక్రమం లో మొత్తం 75 మంది కవులు కవితా గానం చేస్తారు. వీరితో పాటు దేశ విదేశాల అతిథులు, పెద్దలు సందేశాలు ఇస్తారు.
ఈ కార్యక్రమానికి ముందు పలు సామాజిక అంశాలపై తానా ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ స్థాయిలో కవితల పోటీలు” నిర్వహించింది. ఈ పోటీలలో ఎంపికైన కవులు కవితాలహరి కార్యక్రమంలో పాల్గొంటారు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారతదేశ సమగ్రత, రక్షణ, దేశభక్తి, మత సామరస్యం, రైతులు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, యువశక్తి, సాంకేతిక సంచలనాలు, సామాజిక స్పృహ, భవిష్య భారతం, మానవీయ విలువలు వంటి అంశాల పై కవిత్వం ద్వారా చైతన్యం కలిగించటానికి, తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం మరియు కవులను ప్రోత్సహించడం కోసం ఈ మూడు రోజుల బృహత్ అక్షర యజ్ఞం తలపెట్టటం జరిగిందని
తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు, ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు.
అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ “తానా కవితాలహరి” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది.
“తానా ప్రపంచ సాహిత్య వేదిక”
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం)
35వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం
( ఏప్రిల్ 22, 23, 2022, శుక్రవారం, శనివారం, భారతకాలమానం: 7:30 pm – అమెరికా: 7 am PST; 9am CST; 10 am EST;
ఏప్రిల్ 24, 2022, ఆదివారం, భారతకాలమానం: 8:30 pm – అమెరికా: 8 am PST; 10 am CST; 11 am EST;)
“కవితాలహరి” అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
- TANA TV Channel – in YuppTV
- Facebook: https://www.facebook.com/TANAsocial
- YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
- https://youtube.com/teluguone
- www.youtube.com/tvasiatelugu
- www.youtube.com/manatv
- https://www.etvbharat.com/telugu/andhra-pradesh
- https://www.etvbharat.com/telugu/telangana
మిగిలిన వివరాలకు: www.tana.org