TANA: “వచ్చే నెలలో తానా నాయకత్వ ఎన్నికలు : “డా. నాగేంద్ర ప్రసాద్, చైర్మన్, తానా బోర్డు
నిన్న 17 ఏప్రిల్ 2025 వ తేదీన జరిగిన తానా (TANA) అత్యవసర బోర్డు మీటింగ్ పూర్వా పరాలు, మీటింగ్ లో తీసుకొన్న నిర్ణయాలు గురించి తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ” ఎప్పుడూ తానా బోర్డు సమావేశాలు అన్ని సమస్యలు, చేయాల్సిన కార్యక్రమాలు, సంస్థ బాధ్యతలు లాంటి అన్ని విషయాలు కూలంకషం గా చర్చించి నిర్ణయాలు తీసుకొంటామని, ఆ నిర్ణయాలు అన్ని బాధ్యతాయుతంగా వుంటాయి” అని చెపుతూ అనేక వివరాలు అందించారు.
* తానా సంస్థ మునుపెన్నడూ లేని తీవ్రమైన సంక్షోభం లో వున్నదన్న విషయం అందరికి తెలుసు. దాదాపు 3. 6 మిలియన్ డాలర్ల మోసానికి గురి అవడం వలన ఆ సమస్య ను FBI ( ఫెడెరల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ ) దృష్టికి తీసుకెళ్లడం, పిర్యాదు చేయడం జరిగింది. ఆపైన FBI నుంచి , DOJ ( డిపార్ట్మెంట్ అఫ్ జస్టిస్ ) నుంచి కూడా గత 6 సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలు అన్ని సమర్పించమని నోటిస్ రావడం తో తానా బోర్డు మెంబర్లు, EC ( ఎగ్జిక్యూటివ్ కమిటీ ) మెంబర్లు , తానా తరుపున పని చేసే లాయర్లు అనేక రోజులు శ్రమపడి, అన్ని సంవత్సరాల వివరాలు సేకరించి దాదాపు 1050 పేజీల రిపోర్ట్ ని అంద చేయడం జరిగింది. ఒక వాలంటరీ సంస్థ కు ఇది ఎంత పెద్ద బాధ్యత తో కూడిన పనో ఆలోచించండి.
* అంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినా మరికొంత వివరణ, మరి కొన్ని వివరాలు కావాలని FBI అడగడం వలన ఆ వివరాలు సేకరించి ఇవ్వటానికి FBI వారు 31 మే 2025 వరకు టైమ్ ఇచ్చారు కనుక ఆయా వివరాలు కూడా సేకరించే ఇచ్చే ప్రయత్నం లో వున్నాము.
* తెలుగు కమ్యూనిటీ లో, తెలుగు రాష్టాలలో తానా సేవలకి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో, రెండు ఏళ్లకు ఒకసారి జరిగే తానా మహా సభలకు కూడా అంతే ఘనమైన పేరు వుంది. అమెరికా లో తానా సభ్యులు అందరూ ఎదురు చూసే తెలుగు పండగ పేరే -తానా మహా సభలు. అందువలన దగ్గర పడుతున్న తానా మహా సభలు జరపాలాల్సిన బాధ్యత కూడా తానా బోర్డు మీద, తానా ఎగ్జిక్యూటీవ్ కమిటీ మీద వుంది.
* ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకొని నిన్న జరిగిన బోర్డు మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకొన్నాము.
1. పెరిగిన సభ్యుల సంఖ్య, పెరిగిన బాధ్యతలు దృష్టిలో ఉంచుకొని తానా నాయకత్వ టీమ్ సంఖ్య ను పెంచాము. ఈ నిర్ణయం వలన ఇకపైన తానా బోర్డు లో ఇద్దరు సభ్యులు, తానా ఫౌండేషన్ లో నలుగురు సభ్యులు, తన ఎగ్జిక్యూటివ్ కమిటీ లో ఎనిమిది మంది సభ్యులు అదనంగా వుంటారు వారి ఎన్నిక కూడా మిగతా వారితో పాటు అదే పద్దతి లో జరుగుతుంది.
2. తానా ఎగ్జిక్యూటివ్ బోర్డు లో ముఖ్యమైన పొజిషనలు కాకుండా ( ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసెడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్ ) మిగతా అన్ని పొజిషన్ లు ఇదివరలో మళ్ళి అదే పొజిషన్ కి రావడానికి అనర్హులు అనే పాయింట్ ని సవరించి ఇప్పుడున్న వారు మళ్ళీ అదే పొజిషన్ కావాలనుకొంటే అర్హులు గా సెలక్షన్ ప్రాసెస్ కి వేళ్ళ వచ్చు ( ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఇప్పుడున్న సభ్యులు గడచిన కాలంలో కోర్ట్ సమస్య వలన దాదాపు ఒక సంవత్సరం కోల్పోయారు కనుక )
3. అదే విధంగా ఎన్నికలకు సమయం లేదు కనుక ఈ సారి ఎన్నికల విధానము జనరల్ వోటింగ్ ద్వారా కాకుండా బోర్డు వోటింగ్ పద్దతి తో జరగాలని నిర్ణయించారు. ఈ ఎన్నిక పద్దతి లో బోర్డు ఒక కమిటీ ని ప్రకటిస్తుంది. ఆ కమిటీ ఎన్నికల ప్రణాళిక – పదవుల లిస్ట్ ప్రకటించి, ఆ పదవుల కోసం ఆసక్తి – ఉత్సాహం వున్నవారిని నామినేషన్ లు వెయ్యాల్సింది గా కోరుతుంది. ఆ విధంగా నామినేషన్స్ వచ్చాక, ఆ కమిటీ వాటిని పరిశీలించి వాటిలో కొందరిని ఎంపిక చేసి బోర్డు కి సమర్పిస్తుంది. బోర్డు ఆ కమిటీ నిర్ణయాలను చర్చించి, బోర్డు సభ్యులమధ్య ఎన్నిక ద్వారా ఆమోదించి , ఎంపిక అయిన వారిని ప్రకటిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం 31 మే లోపల అయ్యే విధంగా ప్రణాలికను తయారు చేస్తున్నాం.








