NATA: న్యూజెర్సిలో ఘనంగా నాటా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూజెర్సి(New Jersey)లో నాటా(NATA) మహిళా దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. దాదాపు 1,200 మందికి పైగా మహిళలు ఈ వేడుకలకు వచ్చి విజయవంతం చేశారు. ఇంతమంది మహిళలరాకతో ఈ వేడుక జరిగిన ప్రాంతం సందడిగా కనిపించింది. 15కి పైగా నృత్య పాఠశాలల నుండి మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలు, 200 మందికి పైగా ప్రతిభావంతులైన కళాకారులు తమ ఆటపాటలతో, ఫ్యాషన్ షోలతో అందరినీ ఆకట్టుకున్నారు.
నాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఈ వేడుక విజయవంతానికి మద్దతును అందించారు. ఉషారాణి చింత ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. పలువురు మహిళలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కల్పన రామ్, దేవి ప్రసాద్ రోహిత మంచికట్ల, సిరిషా తిరుమల, పద్మ మోనా, లక్ష్మీ ప్రసన్న మరియు మంజు భార్గవలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే స్పాన్సర్లకు కృతజ్ఞతలు:
సాషా రియల్టీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, బాలాజీ ఫ్లవర్స్: వసంత గడమ్శెట్టి, మీనా ఉపాధ్యాయ్ – న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్, ఉష కృష్ణకుమార్, సుజాత వెంపరాల, యాంకర్ మనోజ్ ఇరువూరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.







