కాలిఫోర్నియాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
అయోధ్య రామమందిరం ప్రారంభం కానున్న వేళ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోని పలు నగరాల్లో భారతీయులు భారీ కార్ల ర్యాలీలు నిర్వహించారు. కాలిఫోర్నియాలో రామమందిర చిత్రాలు, కాషాయ బ్యానర్లు ప్రదర్శిస్తూ 1,100 కార్లతో ర్యాలీ నిర్వహించారు. భారీ రామరథంతో ఈ ర్యాలీ వంద మైళ్ల దూరం సాగింది. 300 కార్లతో ఏర్పాటు చేసిన టెస్లా లైట్ షో ఆకట్టుకొంది. బోస్టన్ నగరంలో నివసిస్తున్న ఇండియన్ అమెరికన్లు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని, భారత 7వ గణతంత్ర దినోత్సవాన్ని సంయుక్తంగా జరుపుకొన్నారు.







