Jayaram Komati: ఎపి సిఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న జయరామ్ కోమటి
అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలందిస్తున్న తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి (Jayaram Komati) ని ‘కళారత్న’ పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు సత్కరించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా జయరామ్ కోమటి మాట్లాడుతూ, తనకు ఈ పురస్కారాన్ని అందజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతుగా సహాయపడుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జయరామ్ కోమటికి కళారత్న పురస్కారాన్ని అందించడం పట్ల పలువురు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.







