US: అమెరికా నుంచి విద్యార్థులను వెనక్కి పంపే ప్రక్రియ లో ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందా?
గత నాలుగు వారాలుగా అమెరికా లోని విద్యార్థులే కాక, ఈ దేశం లో ఉంటున్న అందరూ భయపడేలా నడిచిన విద్యార్థులను చిన్న కారణాల మీద వారి వీసా ని రద్దు చేసి వెనక్కి పంపే కార్యక్రమానికి ప్రపంచం మొత్తం ఉల్లిక్కి పాడడం మనం చూసాం. మన తెలుగు వారి విషయంలో తెలుగు సంఘాలు, తెలుగు పెద్దలు, తెలుగు లేదా భారతీయ అటార్నీ లు పరిస్థితులను అర్ధం చేసుకొని , విద్యార్థులకు తగిన సలహాలు ఇచ్చి, వారి చేత SEVIS Notice లకు సమాధానాలు ఇప్పించండం, లా సూట్ లు ఫైల్ చేయించడం జరిగింది. మెల్ల మెల్ల గా ఒక్కో రాష్ట్రంలో ఈ కేసులను పరిశీలించిన కోర్ట్ వారు వీసా రద్దు ను, దేశంనుంచి వెళ్లిపోవాలన్న నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో విద్యార్థులకు కొంచెం ఊరట లభించింది. నాలుగు రోజుల క్రితమే దాదాపు 133 మంది విద్యార్థులకు ఈ విధమైన ఉత్తర్వుల వలన ఊరట లభించిందని తెలుసుకున్నాం.
దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల లో కోర్ట్ లలో జరుగుతున్న విచారణలు పరిశీలిస్తే ట్రంప్ ప్రభుత్వం దేశం లో ఒక్కసారిగా వచ్చిన ప్రతికూల పరిస్థితులను గమనించి మెల్లగా వెనక్కి తగ్గుతోంది అన్న సూచనలు కనిపిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిపార్ట్మెంట్ అఫ్ జస్టిస్ నుంచి వచ్చే సూటి ప్రశ్నలకు సమాధానంగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన అటార్నీ లు ICE ( Immigration & Customs Enforcement ) డిపార్ట్మెంట్ SEVIS ( Student Exchange & Visitor Information System ) మీద త్వరలోనే అన్ని నియమ నిబంధనలతో కొత్త డాక్యుమెంట్ తయారు చేసి విడుదల చేస్తుందని , అంతవరకూ ఇప్పుడు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుంటామని , అప్పటి వరకు కొత్త నోటీసులు ఇవ్వము అని తెలపడం తో ఈ విషయం లో ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, కాలిఫోర్నియా , జార్జియా , మసాచుసెట్స్, మిన్నసోటా, మోంటానా, న్యూ హాంప్షైర్ , న్యూ యార్క్ , ఒహాయో , పెన్సిల్వేనియా , సౌత్ కెలోరినా , టెక్సాస్, వాషింగ్టన్ , విస్కాన్సిన్ , వాషింగ్టన్ డీసీ రాష్ట్రాలలో TRO ( Temporary Restraining Order ) వచ్చాయని .. ఈ రాష్టాలలో కోర్ట్ లు విద్యార్థుల సమస్యలు – చదువు పూర్తి కాకపోవడం, ఉద్యోగం పోవడం లాంటి అన్ని విషయాలు అంగీకరించాయని తెలిసింది.
అయితే ఇండియానా రాష్ట్రం లో ఈ కేసు ని కొట్టి వేసారని కూడా తెలిసింది అంతే కాకుండా ఆరిజోనా, కాలిఫోర్నియా లో కొన్ని జిల్లాలు, ఫ్లోరిడా, ఐయోవా , మిచిగాన్, న్యూ జెర్సీ , న్యూ యార్క్ లో కొన్ని జిల్లాలు, టెక్సాస్ లో కొన్ని జిల్లాలు, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాలలో ఈ కేసు లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, వాటికి కారణాలు ఆయా కోర్ట్ లలో ఉన్న పాత కేసుల తీవ్రత, విద్యార్థుల కేసులలో పూర్తి వివరాలు రాకపోవడం వంటి కారణాలు అని కూడా తెలిసింది.
ఈ సమయం లోనే విస్కాన్సిన్ రాష్టం లో మిల్వాకీ నగరం లో హన్నా దుగన్ అనే కౌంటీ జడ్జి ఉద్దేశ పూర్వకంగా ఒక విద్యార్థి ఇచ్చిన తప్పుడు సమాచారం కేసు లో అరెస్ట్ చేయకుండా తప్పు చేశారని అరెస్ట్ చేసిన సంఘటన కూడా జరిగింది. అందుకే పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి అనుకోకూడదని, మరింత కాలం వేచి చూడాలని, న్యాయ పోరాటం చేయాలని విశ్లేషకులు , అటార్నీ లు సూచిస్తున్నారు.








