GWTCS: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ.. శుభాకాంక్షలు తెలిపిన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం
అమెరికాలో తెలుగు సంస్కృతిని పరిరక్షిస్తూ, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక శుభాకాంక్షలను విడుదల చేసింది.
కార్యవర్గ బృందం సందేశం: సంఘం అధ్యక్షుడు రవి సి అడుసుమిల్లి తో పాటు ఉపాధ్యక్షులు సుశాంత్ మన్నె, రాజేష్ కుమార్ కసరనేని, శ్రీనివాస్ బాబు గంగా, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ వేడుకల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు వారందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.
సంస్థ ప్రతినిధులు:
అధ్యక్షుడు: రవి సి అడుసుమిల్లి
సెక్రటరీలు: భాను మగులూరి, శ్రీవిద్య సోమ
ట్రెజరర్లు: యశస్వి బొద్దులూరి, విజయ్ కుమార్ అట్లూరి
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్: ప్రవీణ్ కొండక, చంద్ర మలవతు, పద్మజ బెవర, ఉమాకాంత్ రఘుపతి, శివాజీ మేడికొండ, రామ్ మైనేని
తెలుగు సంస్కృతికి ప్రతీక
ఒక లాభాపేక్ష లేని సంస్థగా (501 (c) Non-Profit Organization), GWTCS వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారిని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.






