NJ: న్యూజెర్సీలో తొలి అధికారిక దక్షిణాసియా కూటమి ఏర్పాటు.. ప్రకటించిన గవర్నర్ అభ్యర్థి జాక్ సియాటరెల్లి

అమెరికాలోని న్యూజెర్సీ (New Jersey) లో ఏర్పాటు చేసిన సౌత్ ఏసియన్ కోయలేషన్ (దక్షిణాసియా కూటమి)కి అధికారిక గుర్తింపు లభించింది. ఈ కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిధుల సేకరణ కార్యక్రమంలో లక్ష డాలర్లకుపైగా నిధులు సేకరించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీలోని ప్రముఖ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇది న్యూజెర్సీ రాజకీయాల్లో సౌత్ ఏసియన్ల పెరుగుతున్న ప్రభావాన్ని సూచిస్తోంది.
ఈ కూటమి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మేష్ పటేల్, చైర్మన్ శ్రీధర్ చిల్లర, హోస్ట్ కమిటీ మరియు ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ మహేందర్ ముసుకు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
శ్రీధర్ చిల్లర మాట్లాడుతూ.. “జాక్ ఒక సీపీఏ, ఒక ఎంబీఏ, అలాగే ఒక అద్భుతమైన సీఈఓ. న్యూజెర్సీలో వ్యవస్థను బాగు చేసేందుకు ఒక మంచి నాయకుడు కావాలి, జాక్ ఈ పనికి సమర్థుడు” అని అన్నారు.
ఈ సభలో గవర్నర్ అభ్యర్థి జాక్ సియాటరెల్లి మాట్లాడుతూ.. “న్యూజెర్సీ భవిష్యత్తులో సౌత్ ఏసియన్ కమ్యూనిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కమ్యూనిటీలోని ఓట్లు ఎన్నికల ఫలితాలను మారుస్తాయి” అని అన్నారు. ఈ సందర్భంగా సౌత్ ఏసియన్ కోయలేషన్ ను న్యూజెర్సీలో మొట్టమొదటి, ఏకైక “అధికారిక” సౌత్ ఏషియన్ కోయలేషన్ గా జాక్ సియాటారెల్లి ప్రకటించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన హోస్ట్ కమిటీ సభ్యులు శ్రీధర్ చిల్లర, మహేందర్ ముసుకు, థామస్ అలెన్, నిరంజన్ రెడ్డి, రత్నాకర్ పాట్లోల, యువ జి.కె.పాఠం, సుబ్రహ్మణ్యం ఒసూరు, బాలా షాన్, వినయ్ మహాజన్, దినేష్ జైస్వాల్, శ్రీనివాస్ గట్టు, సునీత క్రోసూరి, రామ్ అసోసియేట్స్, అన్నా రెడ్డి, సుబ్రమణ్యం సీతారామన్, చారుదత్త ఖడక్‌బన్, మాధవ్ శ్రీగిరిరాజు, వేణు మూల, రాధా నల్లమల, జగన్ వినాయగం, ప్రవీణ్ అందపల్లి తదితరులకు కోలిషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
మహేందర్ ముసుకు మాట్లాడుతూ, “ఈ రాత్రే లక్ష డాలర్ల నిధులు సేకరించాం. ఇక మన నెక్స్ట్ టార్గెట్.. న్యూజెర్సీ వ్యాప్తంగా జాక్ సియాటారెల్లికి లక్ష సౌత్ ఏసియన్ ఓట్లు సాధించడమే. ఇలాగే మనం చరిత్ర సృష్టిస్తాం” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ కోయలేషన్ ఐటీ & మెర్సర్ కౌంటీ అవుట్‌రీచ్ కోడైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఒసూరు కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా శ్రీధర్ చిల్లర మాట్లాడుతూ.. అందరం కలిసి జాక్‌ను తదుపరి గవర్నర్‌గా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అలాగే ఎవరైనా తమ సౌత్ ఏసియన్ కోయలేషన్ లో చేరాలని అనుకున్నా, మద్దతు తెలపాలని అనుకున్నా facebook.com/SouthAsians4Jack లింకు లేదా
sridhar@jack4nj.com ఈమెయిల్‌లో తమను సంప్రదించవచ్చని తెలిపారు.