ఏఐలో గూగుల్ వెనకబడటానికి కారణమిదే : ఎరిక్

టెక్ దిగ్గజం గూగుల్ కృత్రిమ మేధ రేసులో వెనకబడటానికి ఉద్యోగుల రిమోట్ వర్కింగే ప్రధాన కారణమని ఆ సంస్థ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ అభిప్రాయపడ్డారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్రసంగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమం యూట్యూబ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయనను స్టార్టప్‌లైన ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటివి ఏఐ విషయంలో గూగుల్ కంటే ముందుండటాన్ని ప్రశ్నించారు. దీనికి ఎరిక్ స్పందిస్తూ .. ముక్కుసూటిగా స్పందిస్తున్నందుకు క్షమించండి. మీరంతా విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిన తర్వాత కంపెనీలు పెడితే, మీ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయించి, ఒక్కరోజు మాత్రమే ఆఫీస్‌కు వచ్చేలా చేస్తే ఇతర స్టార్టప్‌లతో పోటీపడగలరని అనుకొంటున్నారా. రేసులో విజయం సాధించడం కంటే ఉద్యోగుల వర్క్‌లైఫ్ బ్యాలెన్సింగ్, తొందరగా ఇంటికి వెళ్లడం, వర్క్‌ఫ్రం హోం చేయడం వంటివే ముఖ్యమని గూగుల్ భావించింది. అందుకే ఆ స్టార్టప్‌లు ఉద్యోగుల నిరంతర పరిశ్రమతో ముందుంటున్నాయి అని వ్యాఖ్యానించారు.