ATA: ఆటా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ‘ధరిత్రి దినోత్సవం’
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) – న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో, సౌత్ బ్రున్స్విక్ టౌన్షిప్లో ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ సందర్భంగా నిర్వహించిన “ధరిత్రి దినోత్సవం – పరిశుభ్రత” కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో సుమారు 50మంది బాలబాలికలు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ (New Jersey) రీజినల్ కోఆర్డినేటర్లు కృష్ణమోహన్ మూలే, ప్రదీప్ కట్టా, ప్రసాద్ ఆకుల మరియు ఉమన్ రీజినల్ చైర్ గీతా రెడ్డి పాల్గొని, ప్రతి వాలంటీర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మీ అందరి సహకారం, సమయాన్ని అంకితం చేయడం వల్లే ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతమైంది” అని వారు పేర్కొన్నారు.
కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు మద్దతు తెలిపిన ఆటా నాయకులకు న్యూజెర్సీ కోఆర్డినేటర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రామసహాయం, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, బోర్డు అఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు, సంతోష్ రెడ్డి కోరం, విజయ్ కుందూరు మరియు ఆటా సీనియర్ నాయకులు డా. పరశురామ్ పిన్నపురెడ్డి, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, రవీందర్ గూడూరు, విజయ్ గోలి, రమేష్ మాగంటి, రవి పెద్ది, మెంబర్షిప్ చైర్ శ్రీకాంత్ తుమ్మల, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శరత్ వేముల మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు గల ప్రమాణాలను గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి అని తెలిపారు.కృష్ణమోహన్ మూలే మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం శారీరకంగా మాత్రమే కాక, మన పరిసరాలను శుభ్రంగా ఉంచి భవిష్యత్తు తరాలకు మంచి ఉదాహరణగా నిలవడమూ అనేది ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ అధిక వేడిమి, జీవవైవిధ్యం కొరత పడటం, ఓజోన్ పొర క్షీణించడం, నగరాల్లో కాలుష్య సమస్యలను నివారణ చేయాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు కృషిగా మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి అని తెలిపారు. ప్రదీప్, విజయ్ గోలి మరియు ప్రసాద్ ఆకుల మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని సామాజిక బాధ్యతా కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆటా న్యూజెర్సీ టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ టీమ్ నుండి ఇషిత మూలే, రిషిత జంబుల, దీక్ష కట్ట, ఇషాని కోరం, షణ్ముఖప్రియ మూలే లు ఆక్టివ్గా పాల్గొని అందరికీ ప్రేరణనిచ్చారు.
పెరుగుతోన్న భూతాపం, వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగాహన పెంచి, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో శుభ్రతపై అవగాహన పెంచడంతో పాటు, బాధ్యతాయుతమైన పౌరులుగా మారే దిశగా బాలలలో ఓ మంచి బలమైన స్ఫూర్తిని నింపడం జరిగింది. మరొక్కసారి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆటా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.








