TANA: తానా ఆధ్వర్యంలో రైతుపరికరాల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సభ్యులు బొడ్డు సుధాకర్ సహకారంతో ఎపి మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి మరియు లింగాలవలస గ్రామాలకు సంబంధించిన రైతులకు టార్పాలిన్ కవర్లను పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో మాజీ వ్యవసాయ ఎడి బొడ్డాడి సీతారామం రైతులను ఉద్దెశించి మాట్లాడటం జరిగింది. రైతులు అంధరు సేంద్రీయ ఎరువులు ద్వారా వ్యవసాయం చేయాలని దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. సేంద్రీయ ఎరువులు తయారుచేసే విధానాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమములో రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.








