నాసాను సందర్శించిన శాంటా మరియా విద్యార్థులు
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో శాంటా మరియా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అమెరికాలోని నాసాను సందర్శించారు. ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా 38 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతరిక్ష శిబిరంలో 3 రోజుల పాటు గడిపారు. టూర్లో భాగంగా వ్యోమగామి లిండా ఫిషర్‌తో కలిసి చర్చించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారని శాంటా మరియా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్ వైశాలి మాట్లాడుతూ ఈ టూర్లో విద్యార్థులు ఎన్నో విషయాలను అర్థం చేసుకునేందుకు అవకాశం కల్గిందన్నారు.







