CAA: వన విహారంలో ఓలలాడిన చికాగో ఆంధ్ర సంఘం

ఊరంతాకలిసి ఊరు చివరన ఉన్న మామిడితోటలోఉసిరిచెట్టు కింద చేరి తలా ఒకచేయి వేసి అందరికి కావలసిన విందు భోజనం వండి, అందరూ కలిసి, చిన్న పెద్ద, ఆష్డా, మగాఅని భేదం లేకుండా కలిసి భోజనం చేసి, ఆడి, పాడి, , అలసిపోయి అక్కడే ఉన్న పచ్చని చెట్ల నీడలో కూర్చొని పిల్ల గాలుల అల్లరిలో సెదతిరుతూపిచ్చపాటి కబుర్లతో గడిపిన ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేము। ఇలాంటి మధురానుభూతులనుచికాగో ఆంధ్ర సంఘం వారు మరొక్కసారి గుర్తుకు తెచ్చారు। ఈ కార్యక్రమానికి చికాగో పరిసర ప్రాంతాల నుండి విచ్చేసిన ఆహ్వానితులు, భానుడి భగభగలను ఏమాత్రం లెక్కచేయకుండా, ఆద్యంతం ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరంలానే, చికాగో ఆంధ్ర సంఘం వారి వనభోజనాలు (Picnic) మరియు పితృదినోత్సవ (Father’s Day) వేడుకలు, సంస్థ 2025 అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, ఛైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షురాలు తమిష్రాకొంచాడ గారి సహకారంతో చికాగో పరిసర ప్రాంతం లోని బస్సీ వుడ్స్ ఫారెస్ట్ప్రిజర్వ్ (Busse Woods Forest Preserve) నందుగత శనివారం ఘనంగా నిర్వహించారు।
కిరణ్ వంకాయలపాటి, అనురాధ గంపాల, హేమంత్ తలపనేని, పద్మారావుఅప్పలనేని, ఒగ్గు నరసింహారెడ్డి, ఆధ్వర్యంలో బృందం కార్యక్రమానికి వచ్చిన అతిధులకు స్వాగతం పలుకుతూ వారి సభ్యత్వాలు నమోదు చేసుకుని ప్రవేశ పట్టీలను (wrist bands) అందజేశారు.
ఆరంభము లోనే అచ్చమైన ఆంధ్ర వన భోజనము తలపిస్తూ అక్కడే వండిన ఆహారంతో, అలనాటి ‘మాయాబజార్’ చిత్రం లో ఘటోత్గజుడు, ‘ఔరౌరగారెలల్లాభళారేబూరెలిల్లా’ అన్నట్లు.. ఒక వైపు కాల్చి నోట్లో వేసుకుంటే కరిగిపోయే మొక్క జొన్నల కండెలు, ఆ పక్కనే “రా రమ్మని” పిలిచే రకరకాల వేడి వేడి దోసెలు. ఇవికాకుండా మాంసాహారులకు ప్రియమైన తందూరీ చికెన్ ఒకదాని వెనుక మరొక ఆహార పదార్థములతో ఏది ముందు తినాలో తెలియని సంకట స్థితిలో విచ్చేసిన అతిధులందరూ వారికీ ఇష్టమైన వంటలను ఆస్వాదించారు. అబ్బో, ఇంక చాలు అనుకునే లోపు , స్థానిక ఇండియన్ రెస్టారెంట్ “నాటు” (NAATU Indian Restaurant)వారు ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన అమోఘమైన, అత్యంత రుచికరమైన భోజనాన్ని చికాగో ఆంధ్ర సంఘం స్వచ్ఛంద కార్యకర్తల బృందం, వచ్చిన అతిథులకు సాంప్రదాయ పద్దతిలో అరటి ఆకుల్లోకోసరికోసరి వడ్డించారు.
“అమ్మా, ఇక ఈరోజుకిఆపేద్దాం…” అనుకునేలోపు, భానుడి తాపాన్ని తగ్గించే చల్లని మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు… ఇంక ఎంత ఎండ ఉన్నా వద్దనలేని మసాలా టీ, వాటితో పాటు కరకరలాడే పకోడి…
అబ్బో! ఒకటేమిటి, వివిధరకాల ప్రత్యేకమైన వంటలతో విచ్చేసిన ఆహ్వానితులందరికీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేలా మురళి రెడ్డివారి నేతృత్వంలో, అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు, ఉపాధ్యక్షురాలుతమిస్రాకొంచాడ గారి సహకారంతో కార్య వర్గ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు అందరికీ వడ్డించారు రామారావు కొత్తమాసు ఈ కార్యక్రమానికిఅవసరమైన సామాగ్రిని సమకూర్చి, ఆద్యంతం ఎటువంటి లోటు జరగకుండా పర్యవేక్షించారు.
ఈ సంవత్సరము ప్రత్యేక ఆకర్షణ గా, వెల్లంఫార్మ్స్ వారు చికాగో ఆంధ్ర సంఘం ఆడపడుచులకు అందచేసిన గోరింటాకు ను సంప్రదాయ పద్దతిలో రోటి లో రుబ్బి ఆషాడము విశేషము గా పిల్లలు , పడతులు వివిధ డిజైన్స్ తో చేతులను అలంకరించారు.
శైలజ సప్ప, అనూష బెస్తా, స్మిత నందూరి బృందం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన పిల్లల కోసం రూపొందించిన వివిధ రకాల ఆటలు మరియు వినోద కార్యక్రమాలు వారికి గొప్ప ఆసక్తిని కలిగించాయి. ఈ కార్యక్రమాలు పిల్లలను మొబైల్ ఫోన్ల నుండి ఇంతసేపు దూరంగా ఉంచి, వారినిప్రత్యక్షంగా ఉత్సాహంగా పాల్గొనేలా చేశాయి.
స్మరణ్ తాడేపల్లి, శ్రీయకొంచాడ, మయూఖ రెడ్డి వారి బృందం ఈ కార్యక్రమానికి కావలసిన యువ స్వచ్ఛంద కార్యకర్తలను సమన్వయపరిచి, మొదటి నుండి చివర వరకు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు.
నిశ్శబ్దంగా మన వెనుక నీడలా నిలబడి నిరంతరం ముందుకు నడిపే నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు నిదర్శనమైన నాన్నలందరికీచికాగో ఆంధ్ర సంఘం వారు పితృ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
శృతి కూచంపూడి ఈ కార్యక్రమం ఆద్యంతం వివిధ రకాల సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్ష ప్రసారం కావడానికి కావలసిన ఏర్పాట్లను చేయగా, ఉపాధ్యక్షురాలుతమిస్రాకొంచాడ, ప్రభాకర్ మల్లంపల్లి ఈ కార్యక్రమానికి వచ్చిన Sponsors కి ఆహ్వానం పలికి వారికి కావలసిన అతిధి సత్కారాలు సమకూర్చారు.
నరసింహ రావు వీరపనేని క్రికెట్, వాలీబాల్, తాడు లాగుడు (Tug Rope) ఇంకా ఇతర ఆటలకు కావలసిన సామాగ్రిని సమకూర్చి ఆటలన్నీ సమగ్రంగా జరిగేలా పర్యవేక్షణ చేశారు.
సంస్థ ట్రస్టీలు దినకర్ కారుమూరి, ఉమా కటికి సుజాత అప్పలనేని కార్యక్రమానికి విచ్చేసి అతిధులకు కావలసిన అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) సహాయార్థం నిర్వహించిన Bingo ఆటకి హరిణి మేడవాక్యత గా వ్యవహరించారు. ఇంతే కాకుండా చికాగో ఆంధ్ర ఫౌండేషన్సహాయార్థం సునీత రాచపల్లి విరాళంగా ఇచ్చిన నగలను అమ్మగా వచ్చిన మొత్తాన్నిచికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) ఖాతాలో జమ చేయడం జరిగింది. శివ పసుమర్తి మరియు విజయ్ కోరపాటితమదైన శైలి లో వాక్యత గా అందరిని అలరించారు. సంస్థ పూర్వ అధ్యక్షులు శైలేష్, గౌరీ అద్దంకి, మాలతీ దామరాజు, శ్వేత కొత్తపల్లి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కావలసిన సహకారాన్ని అందించారు.
సంస్థ స్పాన్సర్స్ అశోక్ లక్ష్మణన్ (Ashok Laxmanan – PMSI Inc), Sriko Batteries నుండి కొండలరావు సప్ప, E-Alliance corp నుండి రమేష్ నయకంటి, DayLight నుండి ఉదిత్ మరియు సమీర్, IndiaCo నుండి చింతన్ పటేల్, మరియు మనబడి జట్టు ప్రత్యక్షంగా పాల్గొని కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కావలసిన సహకారాన్ని అందించారు.
చివరగా సంస్థ తరపున కార్యదర్శి శ్రీ స్మిత నండూరి గారు ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఏమాత్రం లెక్కచేయకుండా కార్యక్రమానికి విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. గత రెండు నెలలుగా చికాగో ఆంధ్ర సంఘం వారి వనభోజనాలను విజయవంతంగా నిర్వహించడం కోసం అహర్నిశలు శ్రమించిన సంస్థ ప్రతినిధులకు, కార్యవర్గ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, స్పాన్సర్స్ కు, పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.