ATA: మిల్వాకీలో వైభవంగా ఆటా ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, ఉమెన్స్ డే వేడుకలు విస్కాన్సిన్ రాష్ట్రం మిల్వాకీలో వైభవంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమానికి హాజరైన వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆటా సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆట పాటలు, భార్యాభర్తల రాంప్ వాక్ పోటీలు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు. శంకర్ నేత్రాలయ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. వేడుకలో రుచికరమైన వంటకాలను ఆటా సభ్యులు తయారు చేశారు.
ఆటా విస్కాన్సిన్ సభ్యులు కళ్యాణ్, ఈశ్వర్, శరత్, ఓమ్ని రెడ్డి, సింధు, సంతోషి, పావని, శ్రావణి, జీవిత, లోహిమ, మనోజారెడ్డి అడ్డి, పోలిరెడ్డి గంట, చంద్రమౌళి సరస్వతి, జయంత్ పార, రాజబాబు నేతి, ప్రవీణ్ డాడీ, వెంకట్ జలారి, శరత్ పువ్వాడి, గోపాల్ నారాయణస్వామి, కరుణాకర్ రెడ్డి దాసరి, చంద్రశేఖర్ తంగెళ్ల, అనుదీప్ నల్లమోతు తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.








