ATA: 15కిపైగా నగరాల్లో ఆటా మదర్స్ డే వేడుకలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, వారి ఆధ్వర్యంలో దాదాపు 15 పైగా నగరాలలో మదర్స్ డే కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించనున్నట్లు ఆటా కార్యవర్గం ఒక ప్రకటనలో తెలియచేసింది. సమాజంలో తల్లి పాత్ర మరువలేనిదని అటువంటి మాతృమూర్తిని గౌరవించడం మన సంప్రదాయంగా భావిస్తూ ఆటా ప్రతి ఏడాది మదర్స్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది అట్లాంటా, వర్జీనియా, ఫ్లోరిడా, రాలీ,మిల్వాకీ, డల్లాస్, హౌస్టన్, బోస్టన్, డిట్రాయిట్, చికాగో తదితర నగరాలలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల మహిళామణులకు అడ్వాన్స్డ్ గా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేసారు, మీ నగరాలలో జరగబోవు ఈవెంట్స్ కి విచ్చేసి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఆటా కార్యక్రమాలలో విరివిగా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేసారు.








