ATA: AAPI డెలిగేషన్కు ఆతిథ్యం ఇచ్చిన ఆటా
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ-ఆపి) డెలిగేషన్ వాషింగ్టన్ డీసీ నగరాన్ని సందర్శించింది. ఈ డెలిగేషన్కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) అధ్యక్షులు జయంత్ చల్ల ఆతిథ్యం ఇచ్చారు. అమెరికాలోని ప్రముఖ డాక్టర్లతోపాటు వర్జీనియా, మేరీల్యాండ్‌లోని స్థానిక డాక్టర్లు కూడా పలు కాంగ్రెషనల్ సమావేశాల కోసం వాషింగ్టన్ డీసీకి రావడం జరిగింది. ఈ బృందానికి ఆపి ప్రెసిడెంట్ డాక్టర్ సతీశ్ కత్తుల, ప్రెసిడెంట్-ఎలెక్ట్ డాక్టర్ అమిత్ చక్రబర్తి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మెహర్ మేడవరం నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా ఆటా, ఆపి కలిసి కమ్యూనిటీలో హెల్త్ ఎడ్యుకేషన్‌ను పెంచేందుకు పలు హెల్త్ సెమినార్ల, వెబినార్లు నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేసేందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆటా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సంస్థ అధ్యక్షులు జయంత్ చల్ల తెలిపారు. ఇటీవలే విద్యార్థులకు సహకారం అందించాలనే ఆశయంతో ఆటా ప్రతినిధులు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులను వర్చువల్‌గా కలిశారు. అలాగే అమెరికాలోని భారతీయులు తమ స్వగ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు కూడా ఆటా సహకరిస్తోంది. దీనికోసం కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థతో చర్చలు జరుపుతోంది.








